అర్ధ రహిత ప్రజాస్వామ్యం
మనం ఎటు వెళ్తున్నామో అర్ధం అవ్వడం లేదు.రాజకీయ అవసరాలకోసం ఆంధ్ర ప్రదేశ్ ను విడదీయడానికి ఒక మైనార్టీ ప్రభుత్వం పూనుకొంటే ,పార్లమెంట్ సాక్షిగా సకల దుర్లక్షణాలు బయట పడుతున్నాయి.ఒకపక్క హౌస్ ఆర్డర్ లో లేదంటూ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ మిగతా కార్యక్రమాలు నడుపుతున్న తీరు ఆశ్చర్యాన్ని కల్గించక మానదు.ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మంత్రులు పదవులు వదలకుండా వెల్ లో కెళ్ళి గొడవచేయడం ఒక వింత.వాళ్ళను పదవులనుండి తొలగించకపోవడం మరో వింత.